బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయ్‌: RBI

RBI వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, మెరుగైన మూలధన సామర్థ్యంతో భారత ఆర్థిక రంగం స్థిరంగా కొనసాగుతోందని ఆర్‌బీఐ వెల్లడించింది. అదే సమయంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు ఆర్థిక రంగానికి కొత్త సవాళ్లుగా మారుతున్నాయని హెచ్చరించింది. వీటిని ఎదుర్కొనేందుకు బ్యాంకులు సాంకేతిక భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్