కుప్పకూలిన బంగారు గని.. 82కి చేరిన మృతుల సంఖ్య

సూడాన్‌ దేశంలో జరిగిన బాగారు గని ప్రమాదంలో మృతుల సంఖ్య 82కు చేరింది. పశ్చిమ కొర్దోఫాన్ ప్రావిన్స్ పరిధిలోని నుహుద్ పట్టణం వద్ద ఉన్న అల్-జారా బంగారు గని మంగళవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. ఆదివారం నుంచే గనిలో పలు చోట్ల కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. కాగా సరైన సేఫ్టీ స్టాండర్డ్స్ లేకపోవడంతో సూడాన్‌లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. 2023లో 14 మంది, 2021లో 38 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్

✕
✕