AP: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 'మొంథా' తుఫాను తగ్గుముఖం పట్టిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని అంటున్నారు. తీర ప్రాంతంలో నివసించే స్థానికులు ఇప్పటికే తమకు కొన్ని చిన్న చిన్న బంగారు ముక్కలు లేదా గవ్వలు, రాళ్ల మధ్య కలిసిపోయిన బంగారు రేణువులు దొరికాయని చెప్పుకుంటున్నారు.