ఇవాళ మరోసారి తగ్గిన బంగారం ధర

రోజురోజుకి బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఒకే రోజు రెండోసారి పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 తగ్గి ప్రస్తుతం రూ.1,61,130గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 తగ్గి రూ.1,47,700కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర రూ.2.90 లక్షలుగా కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కొంత ఊరటగా మారింది.

సంబంధిత పోస్ట్