బంగారం ధరలు మరింత తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 పలుకుతోంది. క్రితం రోజుతో పోలిస్తే సుమారు రూ.2 వేలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.3 వేలు పెరిగి రూ.2,25,000కు చేరింది.