ఆషాఢంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం!

మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారం ధరలు అధిక జ్యేష్ఠ మాసం తర్వాత ఊహించని విధంగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సమయంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగకపోవడం, బంగారం కొనుగోలుపై ఆసక్తి తగ్గడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని, తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్