పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.450 తగ్గి రూ.1,00,030కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 400 తగ్గి రూ.91,700 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,25,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.