భారీగా తగ్గిన బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.6,220 పతనం

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కు చేరింది. దీంతో మూడు రోజుల్లోనే ధర రూ.6,220 మేర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350గా నమోదైంది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. వీటికి 3 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్