హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,900 తగ్గి రూ.1,42,480 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,750 తగ్గి రూ.1,30,600 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,25,000 వద్ద స్థిరంగా ఉంది. ఈ రేట్లకు 3% GST అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.