పసిడి ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,35,220కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.900 పతనమై రూ.1,23,950 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.