హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.660 పెరిగి రూ.1,43,950కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.1,31,950 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.