స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,39,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.1,28,000గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ధరలకు 3 శాతం జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕