స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల​ పసిడి ధర రూ.98,180 ఉండగా, గురువారం రూ.220 పెరిగి రూ.98,400గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.90,000 ఉండగా, ఇవాళ రూ.200 పెరిగి, రూ.90,200కు చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ.1,10,100 ఉండగా గురువారం రూ.100 తగ్గి రూ.1,10,000కి చేరుకుంది. హైదరాాబాద్, విజయవాడ, విశాఖ, ప్రొద్దుటూరులో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్