మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం మరోసారి గణనీయంగా పెరిగాయి. తాజా మార్పుల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,850 పెరిగి రూ.1,28,400కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 పెరిగి రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.5,000 పెరిగి రూ.1,70,000 మార్కును తాకింది. ప్రాంతాలను బట్టి ధరలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕