పసిడి ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.330 పెరిగి రూ.70,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 పెరిగి రూ.64,800గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.100 పెరిగి రూ.87,200కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.