బంగారం పెట్టుబడిదారులకు భారీ లాభాలు!

గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు, ప్రపంచ విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఔన్స్‌కు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్ల వరకు పెరిగాయి. భారత మార్కెట్‌లో MCXలో బంగారం ధర 2025 జనవరిలో రూ.81,028 నుంచి 2026 జనవరి నాటికి రూ.1,75,231కు చేరింది. దీంతో పెట్టుబడిదారులకు సుమారు 116 శాతం రాబడి లభించింది.

సంబంధిత పోస్ట్