ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిలో భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాల విషయంలో గోల్డ్ అప్రైజర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్రైజర్లు షమీ, వెంకటేశ్ రసీదుల్లో తక్కువ తూకం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ షమీపై ఆరోపణలు రావడంతో ఈవో శీనా నాయక్ అతన్ని సస్పెండ్ చేశారు. అయితే, షమీ తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంగారు గోల్మాల్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.