కారు లైట్లలో బంగారం అక్రమ రవాణా

TG: విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారు బిస్కెట్లను కారులో తరలిస్తుండగా హైదరాబాద్‌ శివార్లలో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కియా కారును తనిఖీ చేయగా, టెయిల్‌ లైట్లలో దాచిన 24 క్యారెట్లకు చెందిన 25 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.3.83 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేయాలనుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕