ఆంధ్రా బ్యాంకులో బంగారం చోరీ (వీడియో)

AP: ఈ నెల 19న ఆంధ్రా బ్యాంకులో బంగారం చోరీ జరిగింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల వద్ద ఉన్న ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చింది. 60 గ్రాముల బంగారాన్ని తనిఖీ చేస్తుండగా.. అదే అదునుగా భావించిన ఓ వ్యక్తి పేపర్‌ను అడ్డుపెట్టి అపహరించాడు. బ్యాంకు మేనేజర్ గిరీష్ కుమార్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕