'గోల్‌మాల్ 5' సినిమాలో విలన్‍గా అక్షయ్ కుమార్!

రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న 'గోల్‌మాల్ 5' సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అజయ్ దేవ్‌గన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ వంటి గోల్‌మాల్ గ్యాంగ్‌తో అక్షయ్ ఎలా తలపడతారనేది ఆసక్తికరంగా మారింది. అజయ్ దేవ్‌గన్, టీం ఊటీ షెడ్యూల్‌లో స్పెషల్ బైక్‌పై ఫోజులిచ్చారు. ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్