బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్ స్కావెంజర్ల ఉనికి కారణంగా మధుమేహం, వృద్ధాప్యం యొక్క సంక్లిష్టతను తగ్గిస్తుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని, దీంతో కడుపు నిండిన అనుభూతి కలుగుతుందన్నారు.