అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి తన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి తెలుగోడి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 15వ ఓవర్ మొదటి బంతిని బౌన్సర్‌గా వేసి జో రూట్‌ను భయపెట్టాడు. ఈ క్రమంలో "బాగుందిరా మావా!".. అంటూ నితీశ్ బౌలింగ్‌కు గిల్ తెలుగులో కాంప్లిమెంట్ ఇచ్చినట్లు ఉన్న వీడియో SMలో వైరల్ అవుతోంది.