గుడ్‌న్యూస్.. రేపు 3.58 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ

TG: రేషన్‌ పథకంలో మరో మైలురాయికి చేరామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జూలై 14న కొత్తగా 3,58,187 రేషన్‌ కార్డులు జారీ చేయనున్నామని వెల్లడించారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 15.53 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తుంగతుర్తిలో సీఎం రేవంత్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. పాత కార్డుల్లో 4.41 లక్షల కొత్త సభ్యులను చేర్చామని.. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు పెరగనుందని అన్నారు.

సంబంధిత పోస్ట్