రైల్వే ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా కేంద్ర ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం 78 రోజుల జీతానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) ఇవ్వనున్నారు. దీంతో సుమారు 10.90 లక్షల రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా ఇస్తున్న ఈ బోనస్‌ను ఈసారి కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వే సిబ్బంది కృషితో ఆర్థిక ప్రగతిలో పెరుగుదల సాధ్యమైందని ప్రభుత్వం అభిప్రాయపడింది.