ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కంపెనీలకు దీటుగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ 'వాయిస్ ఓవర్ వైఫై' (VoWiFi) సేవలను ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా ఈ వైఫై కనెక్షన్ సాయంతో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ ప్రకటించింది. ఇకపై సిగ్నల్ సమస్యలతో కాల్ డ్రాప్స్ ఉండవని స్పష్టం చేసింది.