ఉద్యోగులకు గుడ్​ న్యూస్​- EPFO గరిష్ఠ వేతన పరిమితి పెంపు!

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా, ఆ మొత్తాన్ని రూ.21వేలకు పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్