దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ రూ.3 వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులు ఎరువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఎరువుల మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను సమతుల్యం చేయడం, ఎరువుల రిటైల్ ధరను కాపాడటం ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ ప్రధాన లక్ష్యం.