వృషభ, కర్కాటక, కన్యా, ధనస్సు, మకర రాశుల వారికి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండనుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుందని సూచిస్తోంది. సమాజంలో వారి మాటకు విలువ పెరగనుంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమిదని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి, అనుకోని ఆదాయం పెరిగి, ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి.