HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్

HDFC బ్యాంక్ తమ ఖాతాదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. MCLR రేట్లను తగ్గించినట్లు వెల్లడించింది. ఈ మార్పు జులై 7, 2025 నుంచి అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఒక ఏడాదికి MCLR 9.10% నుంచి 8.80%కి, 6 నెలల MCLR 8.95% నుంచి 8.75%కి, 3 నెలల MCLR 8.70% నుంచి 8.65%కి, 1 నెల MCLR 8.60% నుంచి 8.55%కి తగ్గించినట్లు పేర్కొంది. మొత్తం మీద 5 నుంచి 30 బేసిస్ పాయింట్ల (0.05% - 0.30%) వరకు తగ్గినట్లు చెప్పింది. దీంతో ఇకపై గృహ, ఆటో, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

సంబంధిత పోస్ట్