శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకున్నా స్పాట్ బుకింగ్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, పోలీసులు, అధికారులతో సమావేశం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులు సందర్శించనున్నారని.. వారికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.