కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్

తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పింఛన్లు ఇచ్చామని, అర్హులందరికీ ప్రయోజనం కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే అనర్హులు, మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు కూడా తీసుకురానున్నట్లు సీతక్క వెల్లడించారు.

సంబంధిత పోస్ట్