మహిళలకు గుడ్‌న్యూస్.. ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!

TG: 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ.10,000 కోట్ల మార్కును చేరుకుందని TGSRTC అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళా ప్రయాణికులు వినియోగించుకున్నట్లు రవాణా శాఖ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, ఖచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆధార్ కార్డు చూపించకుండానే మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్