కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ గోధుమ పిండి, బియ్యం రిటైల్ విక్రయాలను భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకే ప్రజలకు అందించనుంది. దీనికి సంబంధించి రెండో దశను మంగళవారం ప్రారంభించింది. దీంతో ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి కిలో రూ. 30, బియ్యం రూ. 34 చొప్పున విక్రయించనున్నారు. ఇవి 5, 10 కిలోల ప్యాకెట్స్‌లో లభిస్తాయి.