TG: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.10 మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1580.50 వద్ద ఉంది. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.