గుడ్‌న్యూస్.. RRB గ్రూప్‌ డీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 22,195 గ్రూప్‌-D పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (CBT) షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌, 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కాగా, సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 1,012 ఖాళీలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్