గుడ్ న్యూస్.. ఏపీకి రూ. 665 కోట్ల నిధులు విడుదల

AP: రాష్ట్రంలోని ఉపాధి హామీ పథక లబ్ధిదారులకు ఊరట లభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.665 కోట్ల నిధులను విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు కూడా జతచేయడంతో మొత్తం రూ.831 కోట్లు అవుతుందని.. వాటితో మార్చి 31 నాటికి పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే అవకాశం ఉందని అన్నారు. నిధుల విడుదల చేయించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు పవన్ థ్యాంక్యూ చెప్పారు.

సంబంధిత పోస్ట్