గుడ్ న్యూస్.. SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

లోన్లు తీసుకున్న వారికి శుభవార్త. RBI రెపో రేటును 0.25% తగ్గించడంతో, SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టెర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేటు (EBLR)ను 7.90 శాతానికి, MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి చేర్చింది. అలాగే, 2-3 ఏళ్ల FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల FD రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్