ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ NTPC వద్ద ప్రమాదం జరిగింది. NTPCలో బొగ్గును అన్‌లోడ్ చేసి తిరిగి వస్తున్న ఒక గూడ్స్ రైలుకు సంబంధించిన 4 చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కారణంగా రైల్వే ట్రాక్‌పై కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాలు తప్పిన చక్రాలను సరిచేసే పనులను ప్రారంభించారు.