మరో 11,275 చేయూత పింఛన్లకు ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11,275 కొత్త చేయూత పింఛన్లకు ఆమోదం తెలిపింది. ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితుల కోసం ఈ పింఛన్లను మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. ఇప్పటివరకు 4,63,857 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు కాగా తాజా నిర్ణయంతో చేయూత పింఛన్ల సంఖ్య 4,75,132కు చేరింది.

సంబంధిత పోస్ట్

✕
✕