మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్ల సీనియారిటీ సమస్యకు పరిష్కారం చూపింది. ఫేజ్ 2 టీచర్లకు కూడా ఫేజ్ 1 టీచర్లతో సమానంగా 2013 నుంచి సీనియారిటీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వందలాది మంది టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రమోషన్లలోనూ సమాన అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్