విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది: బండి సంజయ్

TG: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. విద్యారంగంపై మురళి ఇచ్చిన నివేదిక అసంబద్ధమని, ఎవరితోనూ చర్చించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తయారు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్