తెలంగాణ ప్రజలకు నాణ్యమైన రహదారులు, మౌలిక వసతులు అందించాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో రూ.95.75 లక్షల అభివృద్ధి పనులకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేసి మాట్లాడారు.