ఏపీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రైతులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో 570 రైతు గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో పాటు డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. అయితే రైతులకు ఇచ్చే డ్రోన్లు చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.10 లక్షలు ఉంటుందని పేర్కొంది. సబ్సిడీ పోను రూ.2 లక్షలకే రైతులకు వస్తాయి. అయితే ఈ డ్రోన్లు ఒక్కో రైతుకు కాకుండా గ్రూపుగా ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వనున్నారు.