అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్.. ప్రజాస్వామ్య లోపాలపై ఆందోళన

అమెరికాలో 2026 బడ్జెట్‌పై రాజకీయ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఇది ఆర్థిక సమస్యతో పాటు రాజకీయ అస్థిరతకు, విధానపరమైన మొండితనానికి అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారుల చర్యలపై డెమోక్రాట్ల ఆగ్రహం ఈ రాజకీయ పోరాటాన్ని మరింత ముదిర్చింది. గతంలోనూ అనేకసార్లు అమెరికా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. రాజకీయ లాభనష్టాల కోసం ప్రజా పరిపాలనను బందీగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని, రాజకీయ పార్టీలు తమ అజెండాలకంటే ప్రజా ప్రయోజనాలను ముందుంచినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్