మధ్యప్రదేశ్ తికమ్‌గఢ్ జిల్లాలోని దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలికతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. బాలిక ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం బయటికి వచ్చింది.