TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం రంగా రెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పెద్ద పాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని రైతులు తోటలు, పంటలు పెట్టుకొని ఉంటే భూములు అమ్మే పని ఉండదని సూచించారు. ఆయిల్ పామ్ పంట నలభై ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుందని తెలిపారు.