డబుల్ బెడ్‌ రూం ఇళ్లను హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేసిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరు పేదలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించి, లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ఢిదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్