బాలికల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. బాలికల విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి- బేటీ బచావో బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాలను తీసుకొచ్చారు. తొమ్మిది, పదో తరగతి చదివే బాలికలను ప్రోత్సహించేందుకు జాతీయ పథకం, ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ వంటివి ఉపయోగపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్