తెలంగాణలోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్, PV నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీల్లో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిని రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. అగ్రికల్చర్ వర్సిటీలో 550, హార్టికల్చర్‌లో 61, వెటర్నరీ వర్సిటీలో కొన్ని బ్యాక్‌లాగ్‌లతో పాటు 294 పోస్టులున్నాయి. ఇటీవల వీటికి CM రేవంత్ ఆమోదం తెలపగా త్వరలో నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.