కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించనుంది. ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి కుంభకోణం జరిగిందని, నిధుల దుర్వినియోగం చేశారని ప్రభుత్వం గుర్తించింది. కుంభకోణం నిజమని తేలితే కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్